13. రామ మంగళాచరణ శ్లోకాలు(18)
సుభాషితరత్నభాండాగారములోని 'రామచన్ద్రః' మంగళాచరణ శ్లోకాలను తెలుగు తాత్పర్యాలు అర్థ విశేషాలతో కింద పొందుపరచడమైనది.
శ్లోకం 75
వన్దామహే మహేశానచణ్డకోదణ్డఖణ్డనమ్ ।
జానకీహృదయానన్దచన్దనం రఘునన్దనమ్ ॥ 75 ॥
తాత్పర్యం:
శివుని తీవ్రమైన విల్లును విరిచినవాడు, జానకీదేవి హృదయానికి ఆనందాన్నిచ్చే చందనం వంటివాడు అయిన రఘునందనుడైన శ్రీరామునికి నమస్కరిస్తున్నాము.
శ్లోకం 76
నమో రామపదామ్భోజరేణవో యత్ర సతతమ్ ।
కుర్వన్తి కుముదప్రీతిమరణ్యగృహమేధినః ॥ 76 ॥
తాత్పర్యం:
అరణ్యంలో నివసించే మునులు లేదా సాధకులు నిరంతరం శ్రీరాముని పాదపద్మాల ధూళి యందు కలువ పూల వంటి ప్రీతిని (ఆనందాన్ని) కలిగి ఉంటారు. అటువంటి శ్రీరాముని పాదపద్మాలకు నమస్కారములు.
శ్లోకం 77
స్వర్ణైణాజినశయనో యోజితనయనో దశాస్త్ర దిగ్భాగే ।
ముహురవలోకితచాపః కోఽపి యుగాన్తే స నీలిమా గగనమ్ ॥ 77 ॥
తాత్పర్యం:
బంగారులేడి చర్మంపై శయనించి, దశరథుని ఆజ్ఞ లేదా దిక్కుల వైపు చూస్తూ, పదేపదే ధనుస్సును పరిశీలిస్తున్న నీలమేఘ శ్యాముడైన ఆ శ్రీరాముడు యుగాంతంలో ఆకాశమంత వ్యాపించిన పరబ్రహ్మ స్వరూపంగా ప్రకాశిస్తున్నాడు.
శ్లోకం 78
అపి పంచవటీకుటీరవర్తిస్ఫుటితేన్దీవరసున్దరోరుమూర్తిః ।
అపి లక్ష్మణలోచనైకసభ్యః భజత బ్రహ్మ సరోరుహాయతాక్షమ్ ॥ 78 ॥
తాత్పర్యం:
పంచవటిలోని కుటీరంలో నివసిస్తూ, వికసించిన నల్లకలువ వలె నల్లని సుందర దేహంతో, లక్ష్మణుని నేత్రాలకు నిరంతరానందాన్నిస్తూ, పద్మాల వంటి విశాల నేత్రాలు కలిగిన పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీరాముని సేవించండి.
శ్లోకం 79
కనకనికషభామా సీతయాఽఽలిఙ్గితాఙ్గో
నవకువలయదామశ్యామవర్ణాభిరామః ।
అభినవ ఇవ విద్యున్మణ్డితో మేఘఖణ్డః
శమయతు మమ తాపం సర్వతో రామచన్ద్రః ॥ 79 ॥
తాత్పర్యం:
కాచి వడపోసిన పసిడి మేని ఛాయ గల సీతాదేవిచే కౌగిలించబడిన శరీరం కలిగినవాడు, నల్లకలువ దండ వలె నల్లని శరీర కాంతితో మనోహరంగా ఉన్నవాడు, మెరుపులతో కూడిన నూతన నీలమేఘం వలె ప్రకాశించే శ్రీరామచంద్రుడు నా సమస్త తాపాలను (కష్టాలను) పోగొట్టుగాక!
శ్లోకం 80
పరిణయవిధౌ భక్త్వాఽనఙ్గద్విషో ధనుర్గ్రథితో
జనకసుతయా దత్తాం కణ్ఠే స్రజం హృది ధారయన్ ।
కుసుమధనుషా పాశేనేవ ప్రసహ్య వశీకృతోఽవనతవదనో
రామః పాయాత్ త్రపావినయాన్వితః ॥ 80 ॥
తాత్పర్యం:
వివాహ సమయంలో శివుని ధనుస్సును విరిచి, జనకపుత్రి అయిన సీతాదేవి తన మెడలో వేసిన పూలమాలను హృదయానికి హత్తుకుంటూ, మన్మథుని పూలబాణాల పాశంతో వశపరచుకోబడినట్టుగా, సిగ్గు, వినయములతో తలవంచుకున్న శ్రీరాముడు మనలను కాపాడుగాక!
శ్లోకం 81
ఉత్ఫుల్లామలకోమలోత్పలదళశ్యామాయ రామాత్మనే
కామాయ ప్రథమాననిర్మలగుణగ్రామాయ రామాత్మనే ।
యోగారూఢమునీన్ద్రమానససరోహంసాయ సంసారవిధ్వంసినే
స్ఫురదోజసే రఘుకులోత్తంసాయ పుంసే నమః ॥ 81 ॥
తాత్పర్యం:
బాగా వికసించిన నిర్మలమైన, కోమలమైన నల్లకలువ రేకుల వంటి నల్లని కాంతి గలవాడు, నిత్యము శుద్ధ గుణాల సమూహం కలిగినవాడు, యోగారూఢులైన మునుల మనస్సనే సరోవరంలో హంస వంటివాడు, సంసార బంధాలను నశింపజేసేవాడు, రఘువంశ శ్రేష్ఠుడు అయిన ఆ పురుషోత్తమునికి (శ్రీరామునికి) నమస్కారములు.
శ్లోకం 82
యో రామో నిజఘాన వక్షసి రణే తం రావణం సాయకైః
హృద్యస్య ప్రతివాసరం వసతి సా తస్యైవ హ్యాత్మా రాఘవః ।
యస్యాస్తే భువనావళీ పరివృతా ద్వీపైః సమం సప్తభిః
స శ్రేయో విదధాతు నస్త్రిభువనత్రాణైకచిన్తాపరః ॥ 82 ॥
తాత్పర్యం:
యుద్ధంలో రావణుని వక్షఃస్థలంలో బాణాలతో ప్రహరించిన శ్రీరాముడు, ప్రతిదినం ఆమె (సీత) హృదయకమలంలో నివసించే రాఘవుడు, ఏ దేవుని యందు సప్తద్వీపాలతో కూడిన సమస్త భువనములు ఉన్నాయో, ముల్లోకాలను రక్షించడమే ఏకైక ధ్యేయంగా గల ఆ శ్రీరాముడు మనకు శ్రేయస్సును ప్రసాదించుగాక!
శ్లోకం 83
రాజ్యం యేన పటాన్తలగ్నతృణవత్ త్యక్తం గురోరాజ్ఞయా
పాథేయం పరిగృహ్య కార్ముకవరం ఘోరం వనం ప్రస్థితః ।
స్వాధీనః శశిమౌళిచాపవిషయే ప్రాప్తో న వై విక్రియాం
పాయాద్వః స విభీషణాగ్రజనిహా రామాభిధానో హరిః ॥ 83 ॥
తాత్పర్యం:
తండ్రి/గురువు ఆజ్ఞతో తన రాజ్యాన్ని వస్త్రం కొంగున అంటిన గడ్డిపోచలా సులభంగా త్యజించి, విల్లునే బాటసారి ఖర్చుగా (పాథేయంగా) తీసుకుని ఘోర అడవులకు వెళ్లినవాడు, పరమశివుని విల్లును విరిచే సమయంలో కూడా ఎటువంటి వికారము లేదా గర్వము పొందనివాడు, రావణాసురుని సంహరించినవాడు అయిన శ్రీరాముడు అనే శ్రీమహావిష్ణువు మిమ్మల్ని రక్షించుగాక!
శ్లోకం 84
కారుణ్యామృతనీరదంశ్రితజనశ్రీచాతకానన్దదం
శార్ఙ్గం ఖణ్డలచాపమమ్బుజభవానీన్ద్రాదిబృన్దస్తుతమ్ ।
చారుస్మేరముఖోల్లసజ్జనకజాసౌదామినీశోభితం
శ్రీరామామ్బుదమాశ్రయేఽఖిలజగత్ సంసారతాపాపహమ్ ॥ 84 ॥
తాత్పర్యం:
కరుణ అనే అమృతజలాన్ని ఇచ్చే మేఘం వంటివాడు, శరణుజొచ్చిన భక్తులనే చాతక పక్షులకు ఆనందం కలిగించేవాడు, శార్ఙ్గమనే గొప్ప ధనుస్సు ధరించినవాడు, బ్రహ్మ, ఈశానుడు, ఇంద్రుడు మొదలైన దేవతలచే స్తుతించబడినవాడు, మందహాసం చిందించే సీతాదేవి అనే మెరుపుతో శోభిల్లుతున్న శ్రీరాముడనే మేఘాన్ని సమస్త జగత్తు యొక్క సంసార తాపాలను నశింపజేయుటకై ఆశ్రయిస్తున్నాను.
శ్లోకం 85
కూర్మో మూలవదాలవాలవదమ్భోధిర్లతావద్దిశో
మేఘాః పల్లవవత్ ప్రసూనఫలవన్నక్షత్రసూర్యేన్దవః ।
స్వామిన్ వ్యోమతరుః క్రమే మమ కియాన్ శ్రుత్వేతి గిరం మారుతేః
సీతాన్వేషణమాదిశన్ దిశతు వః రామో సలజ్జః శ్రియమ్ ॥ 85 ॥
తాత్పర్యం:
"స్వామీ! ఈ ఆకాశమనే వృక్షానికి కూర్మం వేరు వంటిది, సముద్రం పాదు వంటిది, దిక్కులు తీగల వంటివి, మేఘాలు చిగుళ్ల వంటివి, నక్షత్రాలు, సూర్యచంద్రులు పూలు-పండ్ల వంటివి. దీనిని దాటడం నా కొక లెక్కా!" అని ఆకాశాన్ని వర్ణిస్తూ హనుమంతుడు చెప్పిన మాటలను విని, సీతాన్వేషణకు ఆజ్ఞాపిస్తూ కాస్త సిగ్గుపడిన శ్రీరాముడు మీకు సంపదలను ప్రసాదించుగాక!
శ్లోకం 86
ఏతౌ ద్వౌ దశకణ్ఠకణ్ఠకదలీకాన్తారకాన్తిచ్ఛిదౌ
వైదేహీకుచకుమ్భకుఙ్కుమరజఃసాన్ద్రారుణాఙ్కాఙ్కితౌ ।
లోకత్రాణవిధానసాధుసవనప్రా రమ్భయూపౌ భుజౌ
దేయాస్తామురువిక్రమౌ రఘుపతేః శ్రేయాంసి భూయాంసి వః ॥ 86 ॥
తాత్పర్యం:
రావణుని పది తలలనే అరటి తోటల కాంతిని ఖండించినవి, సీతాదేవి వక్షఃస్థలపు కుంకుమ రజస్సుతో ఎర్రనైన ముద్రలు కలిగినవి, లోకరక్షణ అనే యజ్ఞ ప్రారంభానికి యజ్ఞస్తంభాల వంటివి అయిన శ్రీరాముని గొప్ప విక్రమం గల భుజములు రెండు మీకు నిండైన శ్రేయస్సులను కలిగించుగాక!
శ్లోకం 87
బాలక్రీడనమిన్దుశేఖరధనుర్భఙ్గావధి ప్రార్థితా
తాతే కాననసేవనావధి కృపా సుగ్రీవసఖ్యావధి ।
ఆజ్ఞా వారివిబన్ధనావధి యశో లఙ్కేశనాశావధి
శ్రీరామస్య పునాతు లోకవశతా జానక్యపేక్షావధి ॥ 87 ॥
తాత్పర్యం:
శ్రీరాముని బాల్యక్రీడలు శివుని ధనుస్సు విరిచే వరకు సాగాయి; తండ్రి పట్ల భక్తి అడవులలో నివాసం ఉండే వరకు సాగింది; దయ సుగ్రీవుని మైత్రితో పూర్తయింది; ఆజ్ఞ సముద్ర బంధనం వరకు కొసాగింది; కీర్తి రావణ సంహారంతో ముగిసింది; ఆయన లోకవశత లేదా అనురాగం కేవలం సీతాదేవి అపేక్ష వరకే పరిమితమైంది. అటువంటి శ్రీరామచంద్రుని చరిత్ర లోకాన్ని పునీతం చేయుగాక!
శ్లోకము 88
కల్యాణానాం నిధానం కలిమలమథనం పావనం పావనానాం
పాథేయం యన్ముముక్షోః సపది పరపదప్రాప్తయే ప్రస్థితస్య ।
విశ్రామస్థానమేకం కవివరవచసాం జీవనమ్ అస్తు సజ్జనానాం
బీజం ధర్మద్రుమస్య ప్రభవతు భవతాం భూతయే రామనామ ॥ 88 ॥
తాత్పర్యము
సకల శుభాలకు నిధి వంటిది, కలియుగ దోషాలను నశింపజేసేది, పవిత్రమైన వాటిని కూడా పవిత్రం చేసేది, ఉత్తమ లోకాలను (మోక్షాన్ని) పొందడానికి ప్రయాణమయ్యే ముముక్షువుకు (మోక్షకామికి) మార్గమధ్యంలో ఆహారం (పాథేయం) వంటిది, మహాకవుల వాక్కులకు ఏకైక విశ్రాంతి స్థానము, సజ్జనుల జీవనాధారము మరియు ధర్మమనే వృక్షానికి బీజము అయిన 'రామ' నామము మీ అందరి ఐశ్వర్యానికి, శ్రేయస్సుకు కారణమవుగాక!
అర్థ విశేషాలు
- కల్యాణానాం నిధానమ్: శుభాలకు నిధి/స్థానము.
- కలిమలమథనమ్: కలియుగ పాపాలను తొలగించేది.
- పాథేయమ్: ప్రయాణంలో తినే ఆహారం/మూట.
- ముముక్షోః: మోక్షాన్ని కోరుకునేవానికి.
- సపది: వెంటనే/వెనువెంటనే.
- పరపదప్రాప్తయే: ఉత్తమ పదవి/మోక్షం పొందుటకు.
- ప్రస్థితస్య: బయలుదేరినవానికి.
- భూతయే: సంపద/శ్రేయస్సు కొరకు.
శ్లోకము 89
కల్యాణోల్లాససీమా కలయతు కుశలం కాలమేఘాభిరామా
కాచిత్ సాకేతధామా భవగహనగతిక్రాంతిహారిప్రణామా ।
సౌందర్యాహీనకామా ధృతజనకసుతామాదగాంగాంగధామా
దిక్షు ప్రఖ్యాతభూమా దివిపదనునుతా దేవతా రామనామా ॥ 89 ॥
తాత్పర్యము
శుభాల ఉత్సాహానికి ఆఖరి హద్దు అయినట్టిది, నల్లని మేఘం వలె మనోహరమైన కాంతి కలిగినట్టిది, సాకేత పురము (అయోధ్య) నివాసంగా ఉన్నట్టిది, ప్రణామం చేయగానే సంసారమనే అడవిలో కలిగే అలసటను తొలగించేది, పరిపూర్ణ సౌందర్యము మరియు దివ్య కాంతులు కలిగినట్టిది, సీతాదేవిని (జనకసుతను) మరియు గౌరీదేవిని తన సగభాగంగా ధరించినట్టిది (రాముని పక్షంలో సీతాదేవి, శివుని పక్షంలో పార్వతీదేవి), దిక్కులన్నింటిలో ప్రసిద్ధమైన మహిమ కలిగినట్టిది, దేవతలచే నుతించబడేది అయిన 'రామ' నామ దేవత మీకు కుశలమును (శుభమును) ప్రసాదించుగాక!
అర్థ విశేషాలు
- కల్యాణోల్లాససీమా: మంగళాల శ్రేష్ఠతకు హద్దు.
- కాలమేఘాభిరామా: నల్లని మబ్బువలె అందమైనది.
- సాకేతధామా: అయోధ్య నివాసముగా గలది.
- భవగహనగతి: సంసారమనే అడవిలోని ప్రయాణపు అలసటను తొలగించే నమస్కారము గలది.
- ధృతజనకసుతా: సీతాదేవిని ధరించినది (శ్రీరాముడు).
శ్లోకము 90
యో యోధాన్ యోధయిత్వాన్ సపది పైలభుజః సాపరాయే పరాయే
యేనా యేనాశ్రితానాం స్తుతిరయనమితే శానచాపేన చర్చా ।
లంకాలంకారహర్తా కకుభి కకుమి యః కాంతయా సీతయా సీద్
రూఢో రూఢోఽథ హృష్టః స విభురవతు వః స్వఃసభార్యః సభార్యః ॥ 90 ॥
తాత్పర్యము
ఎవరైతే యుద్ధంలో రాక్షసులను సంహరించారో, ఎవరైతే శివధనుస్సును వంచి ఆశ్రయించిన వారి రక్షణకు కారకులై స్తుతించబడ్డారో, ఎవరైతే లంక యొక్క అలంకారాన్ని (శోభను) హరించారో, ఎవరైతే దిక్కులలో గొప్ప ప్రసిద్ధి పొంది తన ప్రియమైన సీతాదేవితో ప్రకాశించారో, ప్రసిద్ధుడు మరియు సంతోషభరితుడైన ఆ ప్రభువు (శ్రీరాముడు) తన భార్యతో (సీతాదేవితో) కూడి, దేవసభ నాయకుడిలా మిమ్మల్ని రక్షించుగాక!
అర్థ విశేషాలు
- 1. అద్ధా: నిశ్చితముగా.
- 2. పైలభుజః: రాక్షసులను.
- 3. ఆపరాయే: యుద్ధంలో.
- 4. అయే: శత్రువులు.
- 5. ఆయేనా: భాగ్యంతో.
- 6. అర్చా: ప్రాప్తించినది/పూజ.
- 7. ఊనః: రహితమైన.
- 8. దృనః: దుఃఖిత మనస్సు గలవాడు.
- 9. స్వఃసభార్యః: దేవసభాస్వామి/దేవసభ నాయకుడు.
శ్లోకము 91
ఋక్షాణాం భూరిధామ్నా శ్రితమవిపతినా ప్రస్ఫురద్భీమతారే
స్ఫారే నేత్రానలేన ప్రసభ నియమితోచ్ఛాప మీనధ్వజేన ।
రామాయత్తం పురారేః కుముద శుచి లసన్నీల సుగ్రీవమంగం
ప్లావంగం వాపి సైన్యం దశవదన గిరశ్చేదహేతుః శ్రియేఽస్తు ॥ 91 ॥
తాత్పర్యము
వానర సైన్య పక్షంలో:
మిక్కిలి కాంతివంతుడైన జాంబవంతుడు (ఎలుగుబంట్ల రాజు) ఆశ్రయించినది, భయంకరమైన తార, సుగ్రీవుడు మొదలైన వీరులు కలిగినది, నాయకుడైన నలుని కాంతితో ప్రకాశించేది, గొప్ప సముద్రాన్ని లంఘించి రక్షించినది, శ్రీరామునికి అధీనమై ఉన్నది, కుముదుడు, నీలుడు, సుగ్రీవుడు మొదలైన వానరులతో శోభించేది, రావణాసురుని శిరస్సులను (మాటలను) ఖండించడానికి కారణమైన వానర సైన్యం మీకు సంపదను ఇచ్చుగాక!
శివ పక్షంలో (అర్థాంతరం):
నక్షత్రాల ప్రభువైన చంద్రుడిని ధరించినట్టిది, భయంకరమైన మూడవ కంటి అగ్నితో కాముడిని దహించినట్టిది, పార్వతీదేవికి అధీనమైనట్టిది, కుముద పుష్పం వలె తెల్లనైన శరీరము మరియు నల్లని కంఠము (నీలకంఠం) కలిగి ప్రకాశించే శివుని దివ్య మంగళ విగ్రహం మీకు శ్రేయస్సును చేకూర్చుగాక!
అర్థ విశేషాలు
- 10. ఋక్షాణామధిపతినా: జాంబవంతునిచే (వానర పక్షం); పక్షాంతరంలో: నక్షత్రాధిపతి చంద్రునిచే.
- 11. భీమస్తారో: భీముడు, తారుడు అనే వానరులు; పక్షాంతరంలో: భయంకరమైన కంటిపాప (నేత్రకనీనిక).
- 12. నేత్రా: నాయకుడైన నలుడనే వానరునిచే; పక్షాంతరంలో: మూడవ కంటి అగ్నిచే (తృతీయ నేత్రాగ్ని).
- 13. ఉచ్ఛాపః మీనధ్వజః: ఎగిసిపడే అలలు గల సముద్రం; పక్షాంతరంలో: ధనుస్సు యెత్తిన మన్మథుడు.
- 14. రామాయత్తమ్: శ్రీరామచంద్రునికి అధీనమైనది; పక్షాంతరంలో: 'రామ' అనగా పార్వతికి అధీనమైనది.
- 15. కుముద: కుముదుడనే వానరునిచే శోభించేది; పక్షాంతరంలో: తెల్లని కలువ పూవు వలె పరిశుద్ధమైనది.
- 16. నీల సుగ్రీవః: నీలుడు, సుగ్రీవుడు అనే వానరులు; పక్షాంతరంలో: నీల వర్ణంలో శోభించే మంచి కంఠము గలది.
- 17. దశవదన గిరశ్చేదహేతుః: రావణాసురుని శిరస్సులను లేదా మాటలను ఖండించుటకు కారణమైనది. (శివ పక్షంలో రావణుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తన శిరస్సులను కోసి సమర్పించాడనే ప్రసిద్ధి).
శ్లోకము 92
యస్తీర్థానాముపాస్త్యా గలితమలభరం మన్యతే స్మ స్వమేవ
నాజ్ఞాసీజ్జజ్ఞిరే యన్మమ చరణరజాః పాదపూతాన్యమూని ।
పాదస్పర్శేన కుర్వన్ ఝటితి విఘటితగ్రావభావామహల్యాం
కౌసల్యాసూనురూనం వ్యపనయతు స వః శ్రేయసా చ శ్రియా చ ॥ 92 ॥
తాత్పర్యము
ఎవరైతే "పుణ్యతీర్థాలలో స్నానం చేయడం వల్ల నా పాపాలన్నీ తొలగిపోయాయి" అని అనుకున్నారో, కానీ ఆ తీర్థాలే తన పాదధూళి పడటం వల్ల పవిత్రమయ్యానని గ్రహించలేకపోయారో, ఎవరైతే తన పాదస్పర్శతో రాయిగా మారిన అహల్యను క్షణకాలంలో తిరిగి నిజరూపానికి తెచ్చారో, అటువంటి కౌసల్యాదేవి పుత్రుడైన శ్రీరాముడు మీలోని లోపాలను/పాపాలను తొలగించి, మీకు శ్రేయస్సును మరియు సకల సంపదలను ప్రసాదించుగాక!
అర్థ విశేషాలు
- 18. ఉపాస్త్యా: సేవన వల్ల / స్నానము చేయుటచే.
- గలితమలభరం: తొలగిన పాపభారము.
- విఘటితగ్రావభావామ్: రాతి రూపాన్ని తొలగించబడినదానిని (అహల్యను).
- కౌసల్యాసూనుః: కౌసల్యా పుత్రుడైన శ్రీరాముడు.
- ఊనమ్: లోపమును / కొరతను.
- వ్యపనయతు: తొలగించుగాక.
No comments:
Post a Comment